
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వివిధ పరీక్షలు నిర్వహించి వారి ప్రయోజనాలు అందించడానికే ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా సమగ్ర శిక్ష ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కో-ఆర్డినేటర్ దాసరి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం హుజూరాబాద్ జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాలలో ప్రత్యేక అవసరాల పిల్లల గుర్తింపుకై సమగ్ర శిక్ష, ఏ ఎల్ ఐ ఎం సి ఓనిర్ధారణ శిబిరం జరిగింది.

ఈ శిబిరంలో 130 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు గుర్తించి నిర్ధారణ చేశారు. గుర్తింపు తర్వాత వారికి పరికరాలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
హుజురాబాద్ డివిజన్ పరిధిలోని హుజురాబాద్, సైదాపూర్, కేశవపట్నం, వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాలకు చెందిన 18 సంవత్సరాల లోపు పిల్లలు శిబిరానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ కర్ర అశోక్ రెడ్డి, మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు తిరుపతమ్మ, అట్ల శ్రీనివాస్ రెడ్డి, రావుల స్వాతి, సదయ్య, క్రాంతి, ఐఇఆర్ పిలు ఏం జ్యోతి, బొంగాని వెంకటేష్, రాజ్ కుమార్, నరేందర్, ప్రతినిధి రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





