
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థి నేర్చుకోవటం అలవాటు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శంకర్ అన్నారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ ఇంజనీరింగ్ నూతన విద్యార్థుల ఆహ్వాన సభ శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి నేర్చుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థి నేర్చుకోవటానికి పలు విధములైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటర్నెట్లో ఆన్లైన్ లో నేర్చుకోవచ్చన్నారు. కొత్త కొత్త కంప్యూటర్ కోర్సులను ఆన్లైన్లో నేర్చుకోవాలన్నారు. ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులలో చేరి, కొత్త విషయాలలో సర్టిఫికెట్ పొందాలన్నారు. విద్యార్థి నేర్చుకోవడం, చదవడం, రాయడం లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమయాన్ని వృధా చేయవద్దన్నారు. కళాశాలలో లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ లు సాధారణ పని దినాలు, పని గంటలతో పాటు విద్యార్థుల అనుకూల సమయాలను బట్టి కూడా తెరిచి ఉంటాయన్నారు. విద్యార్థి సమాజానికి అవసరమైన ప్రాజెక్టు చేయాలన్నారు.

కళాశాల రిజిస్టర్ డాక్టర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థి అన్ని విధాల అర్హత పొందాలన్నారు. విద్యార్థి కళాశాలలో ఉన్న సదుపాయాలు ఉపయోగించుకొని ఉత్తమ విద్యార్థిగా ఎదగాలన్నారు. హ్యుమానిటీస్ అండ్ సైన్స్ విభాగ అధిపతి డాక్టర్ కే. మధులత మాట్లాడుతూ మొదటి సంవత్సరంలో నేర్చుకున్న విషయాలు ఇంజనీరింగ్ లో పునాదులు వేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ప్రవీణ్ కుమార్ రావు, సమన్వయకర్తలు అధ్యాపకులు శ్రవణ్, రవి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
## లోకల్ యాడ్స్ ##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ మేకల స్వరూప – తిరుపతి గారు,1వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్.. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు హుజురాబాద్.





