
రమేష్, స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
తెలంగాణ పీసీసీ చీఫ్ గా మంత్రి సీతక్క ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 మంది ఆ పదవిని ఆశిస్తుండగా.. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు కావడంతో ఆమె పేరే ఖరారు కానున్నట్లు సమాచారం. హైకమాండ్ ఖరారు చేసినా ఆదివాసీ, మహిళ కావడంతో పార్టీ నేతలు వ్యతిరేకించలేరని టాక్. కేబినెట్ విస్తరణ సమయంలోనే పీసీసీ చీఫ్ మార్పు ఉంటుందని తెలుస్తోంది. ఒక వేళ సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే.. మంత్రి పదవి నుంచి ఆమె తప్పుకోవాల్సి ఉంటుందని సమాచారం. మంత్రి పదవి లేకున్నా పిసిసి చీఫ్ హోదాలో పూర్తి మంత్రి మండలి పార్టీ చీఫ్ చెప్పినట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది అంతేగాక ఆమెకు క్యాబినెట్ హోదా ర్యాంకు కలిగిన వేరే పదవి కూడా కల్పించే అవకాశం ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.