ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పొడిశెట్టి అభిలాష్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో మౌళిక సదుపాయాల కల్పించాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పొడిశెట్టి అభిలాష్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ….ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడి అరికట్టే విధంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ర్టంలో గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాక విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు తిరుగుతూ ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగా బలోపేతానికి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని చాలా పాఠశాలలలో అనేక సమస్యలు నెలకొన్నాయని, సంబంధిత అధికారులు పనులను వేగవంతం చేసి పాఠశాలల ప్రారంభం నాటికి అందుబాటులోకి తేవాలని కోరారు. అడ్మిషన్లు పేరుతో విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తున్న ఆయా ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అభిలాష్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!