క్యాన్సర్ తో మంచం పట్టిన యువకుడు.. -ఆపన్న హస్తాము కోసం ఎదురుచూపు

సెల్. 9966008681 కు ఫోన్ పే గానీ గూగుల్ పే గాని కొట్టండి..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :

రెక్కాడితే కానీ డొక్కాడదు అనే నానుడికి సరిగ్గా సరిపోతుంది కుటుంబం. అతడు కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబాన్ని చూసి కాలం కన్నెర చేసింది. ఆ కుటుంబంలోకి క్యాన్సర్ అనే మహమ్మారి చేరి ఆనందంగా ఉండే వారి జీవితంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్ళితే… హుజురాబాద్ పట్టణంలోని బస్ డిపో సమీపంలో గాజుల రఘు, రజిత దంపతులు నివాసం ఉంటున్నారు. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి చదువులో రఘు మాస్టర్ డిగ్రీ సంపాదించాడు. రఘు తండ్రి వెంకటేశం సోడా బండి నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. రఘు తండ్రి వెంకటేశంకు కూడా తలలో రక్తం గడ్డకట్టి అనారోగ్య పాలయ్యారు. ఒకవైపు ఇద్దరు చిన్నపిల్లలు మరోవైపు అనారోగ్యంతో ఉన్న తండ్రితో కలిపి కుటుంబ భారం మొత్తం రఘు మీద పడింది. రఘు మొక్కవోని ధైర్యంతో తను చదువుకున్న చదువుకు ఉద్యోగం రాకపోయినా ప్రైవేట్ గా ఒక కళాశాలలో టీచర్ గా విధులు నిర్వహిస్తూ కుటుంబంతో పాటు తండ్రి ఆరోగ్యాన్ని చూసుకునేవారు. టీచర్ గా విధులు నిర్వహిస్తూ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని సాదుకుంటూ వచ్చారు. కష్టానికి కష్టం వచ్చినట్టు రఘు జీవితంలో అనుకోకుండా ఒక సంఘటన ఎదురైంది. యధావిధిగా కళాశాలకు వెళ్లే రఘుకు ఉన్నట్టుండి విపరీతమైన తలనొప్పితో పాటు ఒక కాలు వంకర తిరిగినట్లు అయింది. వెంటనే హనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళగా వారు కొన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇక్కడ కాదని నిమ్స్ కి వెళ్లాలని సూచించారు. హైదరాబాదులోని నిమ్స్ కి వెళ్ళినా కూడా అతనికి వచ్చిన ఆరోగ్య సమస్య తెలియకపోవడంతో ఇంటికి తిరిగి వచ్చారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో దగ్గర్లో ఉన్న కరీంనగర్ లోని ప్రతిమ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ బాడీ స్కాన్ చేసి క్యాన్సర్ గా నిర్ధారించారు. క్యాన్సర్ అనే మాట విన్న రఘు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

రఘు భార్య రజిత మనోధైర్యంతో భర్తను హైదరాబాదులోని బసవతారక ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పధకం కింద జాయిన్ చేసుకున్నప్పటికీ కొన్ని రకాల టెస్టులు బయట చేయించుకోవాల్సి వచ్చింది. వారి వద్ద ఉన్న డబ్బంతా ఖర్చయి పోయింది. తెలిసిన వాళ్ళ వద్ద సుమారు రెండు లక్షల పైగా అప్పుచేసి మరి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం వారి వద్ద హైదరాబాద్ కి వెళ్లేందుకు కూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యశ్రీలో ఇంకా కొంత డబ్బు మిగిలి ఉందని, అవి అయిపోయిన తర్వాత తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తారని భార్య రజిత కన్నీరు మున్నిరూ అవుతుంది. రఘుకు క్యాన్సర్ నాలుగో స్టేజిలో ఉందని, ఇప్పటికే ఐదు రేడియేషన్లు, ఒక కీమోథెరపీ అయిపోయిందని చెప్పుకొచ్చారు. తన ఆరోగ్యం కుదుటపడాలంటే మరిన్ని కీమోథెరఫీ పలు దఫాలు చేయించాలని, కొన్ని రకాల టెస్టులు చేయించేందుకు తమ వద్ద ఒక్క రూపాయి కూడా లేదని ఆ కుటుంబం ఆపన్న హస్తాల కోసం ఎదురుచూస్తుంది. తన భర్త పూర్తిస్థాయిలో కోలుకొని యధావిధిగా తమ పూర్తిస్థాయిలో కోలుకొని యధావిధిగా తమ జీవితం కొనసాగించేందుకు దాతలు ముందుకు వచ్చి ఆర్ధిక సహాయం చేయాలని వేడుకుంటుంది రజిత. సుమారు ఇంకో పది లక్షల వరకు ఖర్చు అవుతుందని, తనకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని మానవత్వం కలిగిన వారంతా చేయి చేయి కలిపితే తన భర్తను కాపాడవచ్చు అని వేడుకుంటుంది. తమకు ఆర్థిక సహాయం చేయాలనుకునేవారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటుంది. ఫోన్ పే, గూగుల్ పే 9966008681 ( గాజుల రఘు భర్త)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!