- స్వర్ణోదయం వార్తకు స్పందించిన దాతలు..
- రఘును ఆదుకునేందుకు పలువురు దాతలు చేయూత
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: క్యాన్సర్ తో మంచం పట్టిన పట్టణానికి చెందిన గాజుల రఘు కుటుంబానికి పలువురు దాతలు ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. స్వర్ణోదయం దినపత్రికలో బుధవారం ప్రచురితమైన ‘క్యాన్సర్ తో మంచం పట్టిన యువకుడు- అపన్న హస్తం కోసం ఎదురుచూపు’వార్తకు స్పందించిన పెద్ద పాపయ్యపల్లె గ్రామ ఎంపిటిసి సభ్యురాలు వైద్యుల శిరీష ముకుందరెడ్డి రూ.2000 రూపాయలు ఫోన్ పే చేయాగా, అదే గ్రామానికి చెందిన రజాక్ బాబా 500 రూపాయలు, మరో వ్యక్తి 500 రూపాయలు ఫోన్ పే చేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన నరేడ్ల వినోద్ రెడ్డి రూ వెయ్యి రూపాయలు రావుల రామ్ రెడ్డి 500 రూపాయలు హుజురాబాద్ పట్టణానికి చెందిన అఖిలపల్లి మధుసూదన్ 500 రూపాయలు ఫోన్ పే చేసి తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఇలా పలువురు వ్యక్తులు రఘు దీనస్థితిని అర్థం చేసుకొని ఆయన సెల్ కు ఫోన్ పే చేసి ఆర్థిక సాయం చే చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే క్యాన్సర్ వ్యాధితో దీనస్థితిలో ఉన్న రఘును ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.