
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి జమ్మికుంట:
స్థానిక జమ్మికుంట పాత మార్కెట్లో తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన కేక్ కట్ చేసి స్థానికులకు కేకులు స్వీట్లు పంపిణీ చేశారు. బండ శ్రీనివాస్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు నిండా నూరేళ్లు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంటకు చెందిన మంద రాజేష్, బండారి ప్రశాంత్, కొలుగూరు సురేష్, మహేందర్, నరేష్, శివ, సంపత్, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
