
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
ఏపీలో కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. అధికార వైసీపీకి భంగపాటు తప్పేలా లేదు. ఈ క్రమంలో నల్లజర్ల మండలం చోడవరంలో వైసీపీ ఓటమి పాలవుతోందనే బాధతో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం చేశారు. కత్తితో చెయ్యి కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో వెంటనే ఆయనను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రాలో రాజకీయ ఫలితాలు కార్యకర్తలు నాయకుల్లో హీట్ పుట్టిస్తున్నాయి.






