
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కెనరా బ్యాంక్ హుజురాబాద్ శాఖ మేనేజర్ శ్రీనివాస్ బదిలీపై వెళ్తుండగా ఆయనకు ఉద్యోగులు, పలువురు రైతులు ఘనంగా వీడ్కోలు పలికారు. గత సంవత్సర కాలంగా హుజురాబాద్ లోని ఖాతాదారులకు, రైతులకు నాణ్యమైన సేవలను అందించి అందరి మన్ననలు శ్రీనివాస్ పొందారని ఉత్తమ రైతు వంగల వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆయన బదిలీ పై వెళ్తుండగా శుభాకాంక్షలు తెలిపి
శాలువా కప్పి, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తే, నీతి నిజాయితీగా నడుచుకుంటే ఎక్కడికి వెళ్లినా వారికి ప్రత్యేక గుర్తింపు దానంతట అదే వస్తుందని ఉత్తమ రైతు వెంకటరెడ్డి పేర్కొన్నారు.







