మండల యాదగిరి, స్వర్ణోదయం, ప్రతినిధి జమ్మికుంట:
హుజురాబాద్ లో జరిగిన 1104 విద్యుత్ ఉద్యోగుల సంఘం డివిజన్ స్థాయి ఎన్నికలు శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగాయి, విద్యుత్ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షునిగా మోతే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డి శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేశ్ రవి, అడిషనల్ సెక్రటరీగా అశ్వంత్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ స్థాయి అధ్యక్షునిగా ఎన్నికైన మోతే శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తానని, బదిలీ విషయాలలో నిష్పక్షపాతంగా అందరితో చర్చించి సమన్వయంగా కృషి చేస్తానని తెలిపారు. తనను గెలిపించిన కార్మికులకు మోతి శ్రీనివాస్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.