
-కండువా కప్పి పార్టీలు ఆహ్వానించిన చాడ
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి కరీంనగర్: చిగురు మామిడి మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ ఆఫీసులో జరిగిన సైదాపూర్, చిగురుమామిడి మండల సిపిఐ ముఖ్యకార్యకర్తల సమావేశానంతరం సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, సిపిఐ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామిలు లంకదాసరి కళ్యాణ్ కు సిపిఐ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సిపిఐ పార్టీ భలోపెతానికి కృషి చేయాలని వారు కోరారు. గతంలో సిపిఐ నాయకుడైన కళ్యాణ్ కొన్నాళ్లు వాటికి దూరంగా ఉన్నారు. నేడు తిరిగి సొంత పార్టీలో చేరడంతో పార్టీకి బలం సేకరిందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ బోయిని అశోక్, బత్తుల బాబు, చాడా శ్రీధర్ రెడ్డి, కంది రవీందర్ రెడ్డి, వొడ్నాల వేంకటేష్, శ్రీనివాస్, సమ్మయ్య, రాజేషం, ఒజ్జ కొంరయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.






