
-అంబేద్కర్ స్టేడియంలో, జిల్లా యువజన, క్రీడా శాఖలో జరుగుతున్న అక్రమాలు చర్యలు తీసుకోవాలి.
స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: అంబేద్కర్ స్టేడియంలో, జిల్లా యువజన, క్రీడా శాఖలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని, అక్రమార్కులకు సహకరిస్తున్న డీవైఎస్ ఓ శ్రీకాంత్ రెడ్డిని తొలగించాలని , ఇందులో తప్పుడు పద్ధతిలో ఉద్యోగం పొందిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో పిర్యాదు చేశారు. అనంతరం అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ జిల్లా యువజన, క్రీడా శాఖ పరిధిలో అంబేద్కర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ స్కూల్లు కరీంనగర్ లో పూర్తిగా అవినీతి అక్రమాలు జరుగుతున్న డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి చూసించుడనట్లుగా, వారికీ అన్నిరకాల సహకారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అక్రమాలపై చర్యలు తీసుకోకుంటే నాలుగు రోజుల్లో అంబేద్కర్ స్టేడియం ముందు ఆందోళన, ధర్నా చేస్తామని హెచ్చరించారు. స్విమ్మింగ్ పూల్ కు వచ్చేవారి నుండి డబ్బులు తీసుకొని కూడా రషీదులు ఇవ్వడం లేదని విమర్శించారు. అంబేద్కర్ స్టేడియంలో నైట్ వాచ్ మెన్ గా కొన్ని సంవత్సరాలుగా పనిచేసిన వెంకట్ స్వామి ఇది వరకు సంవత్సరానికి పైగా స్పోర్ట్స్ స్కూల్లో నైట్ వాచ్ మెన్ చేయిస్తున్నారన్నారు. జీతం మాత్రం స్టేడియం నుంచి అందిస్తున్నారని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం చేస్తున్నారన్నారు. స్విమ్మింగ్ పూల్ లో పనిచేసే సుధాకర్ ను డీవైఎస్ ఓ శ్రీకాంత్ రెడ్డి తన వ్యక్తిగత అటెండర్ గా వాడుకుంటున్నారని విమర్శించారు. బదిలీపై వెళ్లిన డీవైఎస్ రాజవీరు ఇక్కడున్నప్పుడు తన తమ్ముడు మరియు బామ్మర్జి కొడుకు స్విమ్మింగ్ ఫూల్ ల్లో, కోచింగ్ హెల్పర్ గా నియమించుకున్నాడన్నారు. అంబేద్కర్ స్టేడియంలో పనిచేసే ఉద్యోగులు ఒక రెండు కుటుంబాలకు సంబంధించిన వారే ఉన్నారని ఆరోపించారు. అటెండర్ రాజ్ కుమార్ తమ్ముడు కె చంద్రశేఖర్, మరో వ్యక్తి అనిల్ కుమార్ స్విమ్మింగ్ పూల్ ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. బి వెంకట్ స్వామి కుమారుడు బి అనిల్ కుమార్ సెక్షన్ ఫిల్టర్ ఆపరేటర్‌గా పని చేయడం జరుగుతుందని ఇతను ఇష్టానుసారంగా డ్యూటీ చేస్తాడన్నారు. ఇప్పటికైనా అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. టి సుధాకర్ కు ఎలాంటి అర్హతలు లేకున్నా నియమించుకున్నారని, గతంలో స్పోర్ట్స్ స్కూల్ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించినాడని, అప్పటి డీవైఎస్ అశోక్ ఇతన్ని తొలగించారు కానీ ఇప్పుడు మళ్లీ సుధాకర్ నియమించుకున్నారన్నారు. ఈ రకంగా అంబేద్కర్ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడా శాఖ మరియు స్పోర్ట్స్ స్కూల్లో అంత కుటుంబ సభ్యుల పాలన నడుస్తున్నదని బండారి శేఖర్ విమర్శించారు.






