
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13 వ వార్డు ఇందిరానగర్ కాలనీకి చెందిన టాంక్ మీనా కౌర్ శనివారం సాయంత్రం గుండె పోటుతో అకస్మాత్తుగా మరణించడంతో ఆదివారం వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ పట్టణ శాఖ అధ్యక్షురాలు యేమూల పుష్పలత మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. పృతురాలి కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే టాంక్ మీనా కౌర్ మృతి చెందడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. ఆమె వెంట నాయకులు నరేష్, జంగ అనిల్, మోరే కృష్ణ, కొలూరి సమ్మయ్య, విష్ణువర్ధన్, ఏం రవితేజ, సాయి తదితరులు ఉన్నారు.







