
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ మున్సిపల్ రిటైర్డ్ ఉద్యోగి రొంటాల వైకుంఠం అనారోగ్యంతో ఆదివారం ఉదయం హుజురాబాద్ పట్టణంలోని గాంధీ నగర్ లో గల తన స్వగృహంలో మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న హుజురాబాద్ అంబేద్కర్ వాదులు, ప్రజాసంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు గాంధీనగర్ లోని ఆయన స్వగృహానికి వెళ్లి మృతదేహం పై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వర్గీయ రొంటాల వైకుంఠం మున్సిపాలిటీలో ఉద్యోగం చేసే క్రమంలో అందరితో కలిసి మెలిసి ఉండేవాడని, అందరితో కలిసిమెలిసి ఉండి అందరి మన్ననలు పొందేవారని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముగ్గురు కొడుకులకు ఉన్నత విద్యను అందించి అందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దాడని ఆయన కృషిని నెమరువేసుకున్నారు. నివాళులు అర్పించిన వారిలో జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి జయపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్, ఎంఐఎఫ్ గౌరవ అధ్యక్షుడు వేల్పుల రత్నం, డిటిఎఫ్ రాష్ట్ర నాయకులు పల్కల ఈశ్వర్ రెడ్డి, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, మట్టేడ ప్రకాష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్ర రవీందర్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు రామగిరి అంకుష్, వేల్పుల ప్రభాకర్, ఇల్లందుల సమ్మయ్య, రాం రాజేశ్వర్, మిడిదొడ్డి సుధాకర్, తాళ్లపల్లి అమరేందర్ గౌడ్, నమిండ్ల రవీందర్, బొడ్డు ఐలయ్య, బొరగాల మొగిలి, రేణిగుంట్ల సందీప్, గాజుల సంపత్, మొలుగు శ్రీధర్ బల్దియా ఉద్యోగులు సిబ్బంది తదితరులు ఉన్నారు.






