
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాదు: బోధన్ చాలన్ కేసులో సస్పెండ్ లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మరియు ఉద్యోగులకు వెంటనే వాణిజ్య పన్నుల శాఖలో విధులలో తీసుకోవాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మంగళవారం రోజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి తెలంగాణ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ సయ్యద్ ముంతాజ్ అలీ రజ్వి తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డాక్టర్ TK శ్రీదేవిలకు విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ గత నిజామాబాద్ జిల్లా బోధనలో జరిగిన రైస్ మిల్ యజమానులు వారి యొక్క ఆడిటర్ యొక్క లాలూచ వలన జరిగిన బోధన్ చాలన్ల కేసులో వాణిజ్య పనుల శాఖ అధికారులు మరియు ఉద్యోగులు 40 రోజులు జైలు జీవితం కరీంనగర్లో గడిపారు వచ్చిన వాణిజ్య పనుల శాఖ అధికారులు మరియు ఉద్యోగులకు వారిని తిరిగి ఉద్యోగాలలో తీసుకోవాలని మానసికంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారి కుటుంబాలను వారి మీద ఆధారపడిన ఉన్నారని దృష్టిలో ఉంచుకొని మానవతతో వారిని తిరిగి విధులను తీసుకోవాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు వాణిజ్య పనుల శాఖలో సస్పెండ్ లో ఉన్న ఉద్యోగులు రోజురోజుకు మానసికంగా కుమిలిపోతున్నారు వారి మీద ఆధారపడిన భార్య పిల్లలు ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా కొంతమంది ఉద్యోగులు వారికి ఉన్న ఒక ఇంటిని వారి వద్ద ఉన్న కొన్ని వస్తువులను కుదువాబెట్టి ఇతర వ్యక్తుల వద్ద నుండి అప్పు తీసుకొని వారి కుటుంబానికి సాదుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న బోధన్ చాలన్ కేసులు ఇరుకొని మానసికంగా కుంగిపోతున్నారు ఎవరు చేసిన తప్పును వీళ్లు ఇబ్బందులకు గురి అవుతున్నారు దాదాపు ఏడున్నర సంవత్సరాల నుండి అధికారులు ఉద్యోగులు రెండు సంవత్సరాల నుండి సస్పెండ్ లో ఉండి అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం నుంచి రావాల్సిన వారి జీతం 50% ఆరు నెలలకు ఒకసారి రావడం వలన ఇల్లు గడవక ఇతర వ్యక్తుల వద్ద అప్పు డబ్బులు తీసుకుని వారికి రెండు వంతులు చెల్లించే పరిస్థితి వారికి వచ్చింది అధికారుల చుట్టూ తిరుగుతూ మాకు మళ్లీ వాణిజ్య పనుల శాఖలో వీధులలో తీసుకోండి అని చెబుతూ ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞప్తి చేస్తుంది తిరుగుతున్నారు ఎవరి వద్దకు వెళ్లి అడగడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇతర పరిచయం ఉన్న వ్యక్తుల వద్ద ఎంతో అంటూ అప్పుచేసి నిజామాబాదు నుండి హైదరాబాద్ కు వెళ్లి ప్రతిసారి అధికారుల వద్ద వినతి పత్రాలు ఇచ్చి మాకు న్యాయం చేయండి మాకు మళ్ళీ వాణిజ్య పనుల శాఖలో పనిచేయడానికి విధులను తీసుకోండి అని ప్రతి అధికారి వద్ద రెండు చేతులతో దండం పెట్టుతూ విజ్ఞప్తి చేస్తున్నారు బోధన్ చాలా కేసు లో సస్పెండ్ అయిన చిరు ఉద్యోగులు వారు రెండు సంవత్సరాల నుండి సస్పెండ్ లో ఉండటం వలన వారి తల్లిదండ్రులు అనారోగ్యానికి గురి అయిన వారిని హాస్పటల్లో చూపెట్టడానికి కూడా వారి వద్ద డబ్బులు లేక వారు ఏం చేయాలో అర్థం కాక వారి వద్ద వారి ఇంట్లో ఉన్న వస్తువులను కుదువబెట్టి వారి తల్లిదండ్రులను తీసుకుని వెళ్లి హాస్పటల్లో చూపెడుతున్నారు ఇంట్లో ఉన్న పిల్లల చదువుల కొరకు కావలసిన పుస్తకాలు బట్టలు లేక మానసికంగా కుమిలిపోతున్నారు వారి పిల్లలకు పాఠశాలలను ఫీజులు చెల్లించలేని పరిస్థితులలో ఆ పిల్లలను వారి ఇంటి వద్దనే ఉంచుకొని చదువు చెప్పుకునే పరిస్థితి వారికి వచ్చింది కనుక ఇలాంటి పరిస్థితులలో వారు కుమిలిపోతున్నారు కనుక దయచేసి ఇప్పటికైనా మానవతా దృష్టితో వారి యొక్క సస్పెండ్ ను ఎత్తివేసి వారిని తిరిగి వాణిజ్య పనుల శాఖలు విధులలో తీసుకోవాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ సయ్యద్ ముంతాజ్ అలీ రాజ్వి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ డాక్టర్ టి కె శ్రీదేవి లకు విజ్ఞప్తి విజ్ఞప్తి చేశారు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడు బోధన్ చాలన్ కేసులో సస్పెండ్ లో ఉన్న ఉద్యోగులందర్నీ తిరిగి వారిని విధులలో తీసుకోవడానికి అధికారులందరూ సహకరించాలని ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు






