
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని రజక వీధికి చెందిన పాక రవీందర్ (58) అనే ప్రైవేట్ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పలు ఎన్జీవో సంస్థల్లో సూపర్వైజర్ గా పనిచేసిన ఆయన ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలడు. ఆయన మృతి పట్ల మాల మహానాడు రాష్ట్ర నాయకులు పాక సతీష్, కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు, యేముల పుష్పలత, సొల్లు సుమతి, డాక్టర్ ప్రకాష్, మాలతి, నారాయణరెడ్డి, రాజ్ కుమార్, సతీష్, సంపత్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.






