
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో కొన్ని సంవత్సరాల నుండి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లుగా, వారికి వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా ప్రమోషన్ లు లేక కొన్ని సంవత్సరాల నుండి వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని టిసిటి ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు. అనేక సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డాక్టర్ టికె శ్రీదేవి ఎంతో చోరువ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ లకు సీనియర్ అసిస్టెంట్లుగా మరియు సీనియర్ అసిస్టెంట్లకు ఏసిటిఓ ప్రమోషన్లు ఇవ్వడానికి ఎంతో చొరవ తీసుకుంటున్నందుకు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డాక్టర్ టీకే శ్రీదేవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టిసిటిఎన్ జిఓ సంఘం అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ఎంతోమంది గత కమిషనర్లకు ఎన్నో రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోయేది కానీ ఈ రోజు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా డాక్టర్ టికె శ్రీదేవి పదవి బాధ్యతలు చేపట్టినప్పటినుండి ఇప్పటివరకు ప్రతి ఒక ఉద్యోగి సమస్యలను పరిష్కరిస్తూన్నారన్నారు. వారి సమస్యల పరిష్కారం కొరకు ఎంతో కృషి చేస్తున్నా అధికారి శ్రీదేవి అలాంటి కమిషనర్ మా వాణిజ్య పన్నుల శాఖకు రావటం వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల అదృష్టం అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగుల బదిలీలతోపాటు ప్రమోషన్లను కూడా ఇస్తూ ఆ ఉద్యోగుల బదిలీలను కూడా చేపట్టడానికి ముందుకు వచ్చినందుకు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డాక్టర్ టీకే శ్రీదేవితో పాటు అడిషనల్ కమిషనర్ సెక్రెటరీ సునీత, జాయింట్ కమిషనర్ రవి అధికారులు అందరికీ టిసిటిఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతే కాకుండా ఇండియాలోనే మొట్టమొదటగా ప్రథమ స్థానంలో జీఎస్టీ రెవిన్యూ రావడానికి కూడా ఎంతో కృషి చేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డాక్టర్ టికె శ్రీదేవికి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రెవిన్యూ తేవడానికి రాత్రి పగలు కృషి చేయాలని కోరారు. ఎవరైనా వ్యాపారస్తులు బకాయి ఉన్న టాక్స్ లను కూడా వెంటనే కట్టించడానికి అధికారులు, ఉద్యోగులు కృషి చేయాలని అన్నారు. ఆలాంటప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఇండియాలోనే జీఎస్టీలో మొదటి స్థానం రావడానికి అవకాశం ఉంటుందని టిసిటి ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు. ఆమెని సందర్భంగా కలిసి పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపామన్నారు.







