హైదరాబాద్‌లో కొత్త వైరస్… తీసుకోవాల్సిన జాగ్రత్తలివే! -ఎక్స్ వేదికగా భాగ్యనగర వాసులను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ..!

-చేతులు సబ్బుతో కడుక్కోవడం, కాచి చల్లార్చిన నీరు తాగడం చేయాలని సూచన

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరో వైరస్ విజృంభిస్తోంది. వేగంగా వ్యాపించే నోరో వైరస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ నగరవాసులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు జారీ చేసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భాగ్యనగరవాసులకు సూచనలు చేసింది. ‘నోరో వైరస్ వ్యాధితో జాగ్రత్త!! కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.’ అని పేర్కొంది. చలిజ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ ఈ నోరో వైరస్ లక్షణాలు అని పేర్కొంది. ప్రస్తుతం నోరో వైరస్ కేసులు నగరంలోని యాకుత్‌పురా, మలక్ పేట, డబీర్‌పురా, పురానాహవేలీ, మొఘల్‌పురలతో పాటు పలు ప్రాంతాల్లో నమోదయ్యాయి. నోరో వైరస్ బారిన పడినవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

*తీసుకోవాల్సిన జాగ్రత్తలు*

  • చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి.
  • కాచి చల్లార్చిన, వడపోసిన నీటిని తాగాలి.
  • ఇంటిని, పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి…
  • ప్రజలు అనవసరంగా భయభ్రాంతులకు గురి కాకుండా అజాగ్రత్త నిర్లక్ష్యాన్ని వీడాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!