
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర కులాల జనగణన సమితి హుజురాబాద్ కన్వీనర్ గా పట్టణంలోని 15 అవార్డుకు చెందిన మార్త రవీందర్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు సామాజిక జేఏసీ చైర్మన్ రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ తెలిపారు. కో కన్వీనర్లుగా పులి జగన్నాథం, భీమోజు సదానందం, పెట్టాం కుమారస్వామి, సాదుల రవీందర్, సందెల వెంకటేశ్వర్లు, కేశవులు, బుచ్చన్న, టీఎస్ సింగ్, తాళ్లపల్లి అమరేందర్ గౌడ్, పులిపాక సారయ్యలను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.






