
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని జమ్మికుంట రోడ్డులో గల న్యూ కాకతీయ ఉన్నత పాఠశాలలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని శనివారం బోనాల వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ బి రాజ్ కుమార్, డైరెక్టర్లు గోపాల్, వెంగళరావుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించగా విద్యార్థినిలు అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకొని అమ్మవారికి సమర్పించిన తీరు చూపరులను ఆకట్టుకుంది. పలువురు విద్యార్థులు అమ్మవారు, పోతరాజుల వేషధారణలు ధరించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించి బోనాల ప్రాముఖ్యతను పాఠశాల నిర్వాహకులు విద్యార్థులకు వివరించి చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్, డైరెక్టర్లతో పాటు ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉపేంద్ర, ఆశ, శైలజ, రమేష్, రమేష్, అనిల్, మౌనిక, రాణి, అశ్విని, సరిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.






