రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమించండి..కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియజేయాలి-బీజేపీ జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఇల్లందకుంట మండలం భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి అధ్యక్షతన శనివారం ఇల్లందకుంటలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన బిజెపి జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని ప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ప్రసాద్ దుయ్యబట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అత్యధిక సర్పంచ్, ఎంపీటీసీ జడ్పిటిసి స్థానాన్ని కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలు పనిచేయాలని రాపర్తి ప్రసాద్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరో జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బిజెపి శ్రేణులు సమిష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు పార్టీ పటిష్టత కోసం పనిచేస్తూనే ప్రజా సమస్యలపై ఉద్యమించాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ప్రజా సమస్యల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని కరుణాకర్ మండిపడ్డారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి పైసల పంచాయితీలకు కౌశిక్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నాడని బింగి కరుణాకర్ ఆరోపించారు. కొత్తగా ఏర్పడ్డ ఇల్లందకుంట మండలంలో ఇప్పటివరకు ప్రభుత్వ సొంత కార్యాలయాలు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. వెంటనే ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టి చర్చించడం జరిగింది. ప్రధాన సమస్యలపై ఉద్యమించాలని మండల కమిటీ తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్, మండల అధ్యక్షులు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, మండల సంస్థాగత ఇన్చార్జి బింగి కరుణాకర్, అంతo ఎల్లారెడ్డి, కంకణాల సురేందర్ రెడ్డి, ఎండి షఫీ ఖాన్, తాళ్ల లావణ్య, కందాల రాజేందర్, తడిగొప్పల రమేశ్, మట్ట పవన్ రెడ్డి, గుత్తికొండ రాంబాబు, రమణాచారి, కొత్త శ్రీనివాస్, భక్కతట్ల రాజన్న, నూనె శివ, ఇరువాల రమేశ్, జోడు సంపత్, మురహరి గోపాల్, నర్రా మధుకర్ రెడ్డి, ఉప్పు దుర్గయ్య, వినయ్, రవీందర్, తిరుపతి గౌడ్, రమేశ్, సాయిరెడ్డి, సంజీవరెడ్డి, సదాకర్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి, మదాసు మొగిలి, తుపాకుల సతీశ్, స్వామిదాసు, వెంకటేశ్, అశోక్, శ్రావణ్, కుమార్, రాములు, శ్రీనివాస్, మురళీ, రాజు, అనిల్, పాపిరెడ్డి, లింగయ్య, సదాకార్ రెడ్డి, భద్రయ్య, రాకేష్, రాజిరెడ్డి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!