
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
శంకరపట్నం మండల కేంద్రమైన కేశవపట్నం నుండి చెర్లపల్లే మీదుగా ఎగ్లాస్ పూర్ రేకొండ గ్రామాలను కలుపుతూ బీటి రోడ్డు నిర్మాణం, అలాగే కేశవపట్నం నుండి కరీంపేట వయా మొగిలిపాలెం వరకు రోడ్డు వెడల్పుకు సహకరించాలని కోరుతూ శంకరపట్నం బిజెపి నేతలు శనివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మొదటి ప్రాధాన్యతగా సీఆర్ఎఫ్ నిధుల నుండి పనులు చేయించాడని కృషి చేస్తానని మంత్రి చెప్పారు. అలాగే అర్కండ్ల వాగుపై వంతెన నిర్మాణం, మండలంలోనీ పలు అభివృద్ధి పనులను మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకువచ్చారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో బిజెపి మండలాధ్యక్షుడు ఎనుగుల అనిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఖాజాపాషా, నాయకులు రాసమల్ల శ్రీనివాస్, గూళ్ల రాజు, బిజిలి సారయ్య, గుర్రం శ్రీనివాస్, బొజ్జ సాయి ప్రకాష్, ఎలుకపెళ్లి సంపత్, మేడిశెట్టి రాజేష్, అరవింద్ తదితరులు ఉన్నారు.






