
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ నుండి జమ్మికుంటకు ప్రతిరోజు నడుపుతున్న మినీ బస్సులు నిత్యం ఎక్కడపడితే అక్కడ ఫెయిల్ (రిపేరుకు) వస్తుండడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ఐదారు సంవత్సరాల క్రితం మినీ బస్సులు హుజురాబాద్ డిపోకు రాగ ఐదు సంవత్సరాలకు పైగా ఇదే రోట్లో నడుస్తూ అత్యధిక ఆదాయాన్ని డిపోకు సమకూరుస్తున్నాయి.
అవి ఇప్పటికే స్క్రాప్ కి వెళ్ళిపోవాల్సి ఉండగా ఈ ఆర్టీసీ బస్సులు అనుకున్న దానికంటే లక్షల కిలోమీటర్ల రీడింగ్ తిరిగినట్లు తెలుస్తుంది. ఒక్కో మినీ బస్సును నిత్యం 350 నుండి 400లకు పైగా కిలోమీటర్లు నడుపుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో బస్సులు లేక ఉన్న బస్సులను రిపేర్ చేసి వాటిని మళ్లీ మళ్లీ నడిపిస్తున్నారు. నిత్యం నడుస్తున్న మినీ బస్సుల్లో రోజుకు ఒక బస్సు ఎక్కడపడితే అక్కడ రోడ్డు మీదనే ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. 30 మంది కెపాసిటీ ఉన్న మినీ బస్సు 50 నుండి 60 మంది ప్రయాణం చేస్తున్నారు. దీంతో మినీ బస్సులను కెపాసిటీ ప్రకారం నడిపే పరిస్థితి లేక ఎక్కడపడితే అక్కడ ఆగిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లవలసిన ప్రయాణికులు రోడ్లమీద పడి కాపులు గాస్తున్నారు. హుజురాబాద్ డిపోకు గుండెకాయ లాంటి జమ్మికుంట బస్టాండ్ నుండి నిత్యం వేలాదిమంది ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. దీంతో హుజురాబాద్ డిపోకు జమ్మికుంట – హుజురాబాద్ రూట్ లో నడిచే బస్సుల ద్వారానే ఈ డిపోకు ఏక్కువ ఆదాయం వస్తుంది. ఇలానే బస్సులు నడిపితే జరగరాని ప్రమాదం జరుగుతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల తర్వాత హుజురాబాద్ డిపోకు మేనేజర్ గా రవీంద్రనాథ్ వచ్చి వీధిలో చేరినది విధితమే. ఇప్పటికైనా మినీ బస్సులు మీద దృష్టి పెట్టి కొత్త బస్సులు తీసుకు వచ్చి ప్రజలకు ప్రమాద రహిత రవాణా సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.








