
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన నషా ముక్తుభారత్ అభియాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ జీనియస్ పాఠశాలలో పోస్ట్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు జాతీయ పతాకాలను చేత పట్టుకొని డ్రగ్స్ వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేశారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పోస్టుమాస్టర్ ఊకంటి మహేందర్, మోహన్, ఆల్ ఫోర్స్ ప్రధానోపాధ్యాయులు సంగీత, పలువురు ఉపాధ్యాయులు, పోస్ట్ ఆఫీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







