
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా నియమితులైన మహేష్ గౌడ్ ను హుజురాబాద్ ప్రాంతానికి చెందిన టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి తిరుమల శ్రీవారి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన మహేష్ గౌడ్ నిదర్శనం అని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పటిష్టమవుతుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ అని ప్రజలు ఆదరించి అద్భుతమైన విజయాన్ని అందించారని ఉన్నారు. దీనిని ముందుకు తీసుకు వెళ్లడానికి మహేష్ గౌడ్ నేతృత్వంలో పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జమ్మికుంట పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులు దొమ్మటి వెంకటేశ్వర్ గౌడ్ ఉన్నారు.






