Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఇంటిలో ప్రతిష్టించి తొమ్మిది రోజులపాటు గణనాథుడికి ఓ చిన్నారి ఎంతో భక్తిశ్రద్ధలతో నిత్యం పూజలు చేసి వేడుకలు నిర్వహించుకున్నడు ఆ బాలుడు. నిమజ్జనం రోజైన సోమవారం రాత్రి గణపతి విగ్రహన్ని నీళ్లల్లో వేయడానికి ససేమిరా అన్నాడు. తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పిన వినకుండా తన చేత పట్టుకొని నీళ్లలో వేయడానికి ఇవ్వకపోగా రోదించాడు. ఆ చిన్ని వినాయకుడిపై ఎంతో ప్రేమ కలిగిన బాలుడు ఎక్కడో కాదు హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలేజ్ చెందిన అన్వేష్ తన తండ్రి రాజు, తల్లితో కలిసి నిమర్జనం కార్యక్రమానికి కరీంనగర్ రోడ్ లోని ఎస్ఆర్ ఎస్ పి కాల్వ వద్దకు చేరుకున్నాడు. పిన్ని వినాయక విగ్రహాన్ని నిమర్జనం చేయడానికి ఇవ్వమని తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఇవ్వకుండా ‘ఆ నేను ఇవ్వ.. ఇంటికి తీసుకు వెళ్తా’ అంటూ ఎక్కెక్కి ఏడవడం స్థానికులను ఆలోచింప చేసింది. తొమ్మిది రోజులపాటు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచిన ఆ బుజ్జి వినాయకుడిని నిమజ్జనం చేయడానికి చిన్నారికి మనసు రాకపోవడం విగ్రహం పై పెంచుకున్న ప్రేమకు అతనికి ఉన్న భక్తి భావానికి పలువురు శభాష్ అని అన్నారు.









