Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: పెరియర్ ఇవి రామస్వామి 146వ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వాకర్స్ సభ్యుల ఆధ్వర్యంలో సాదుల రవీందర్ అధ్యక్షతన పెరియర్ర ఇవి రామస్వామి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సమావేశంలో పెరియర్ ఇవి రామస్వామి నాయకర్ సంఘసంస్కర్తగా హేతువాది మూఢనమ్మకాలపై పోరాటం నాస్తిక వాది రాజకీయంలో పెను మార్పులు తెచ్చిన నాయకుడు అన్నారు. కుల నిర్మూలనకు కృషిచేసి, వితంతు వివాహాలను ప్రోత్సహించినాడన్నారు. ఆలయ ప్రవేశాలు చేయించి, బ్రాహ్మణిజంపై పోరాటం చేయడమేకాక తమిళనాడులో బీసీ నాయకత్వాన్ని తెచ్చిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. అంబేద్కర్ సమకాలికుడు జన్మదినాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, పల్కల ఈశ్వర్ రెడ్డి, పాక సతీష్, ఇల్లందుల సమ్మయ్య, మాజీ ఎంపీపీ పోడిశెట్టి వెంకటరాజం, గొర్రె చిరంజీవి, బండ కిషన్, వేల్పుల ప్రభాకర్, లెంకల సారయ్య, కుడికాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.






