
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజురాబాద్, సెప్టెంబర్ 25:
హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రజల ఏవైనా సమస్యలు వచ్చినప్పుడూ తాను ఎప్పుడు అండగా ఉంటానని, వాటి పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఆయన అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్న బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు.”నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులుంటే నేరుగా నన్ను సంప్రదించండి. నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. ప్రజల సంక్షేమం కోసం అందుబాటులో ఉండటం నా బాధ్యత,” అని ఆయన పేర్కొన్నారు. వీణవంక, హుజురాబాద్ మండలాల్లో వివిధ గ్రామాలకు స్వయంగా వెళ్లి మొత్తం 18 లక్షల రూపాయల విలువైన 78 సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వీణవంక మండలంలో 42 చెక్కులు, హుజురాబాద్ రూరల్లో 26 చెక్కులు, హుజురాబాద్ టౌన్లో 10 చెక్కులు అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద మెరుగైన వైద్య సేవలను అందించడానికి కృషి చేస్తానని, అలాగే బాధితులకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా వారి భరోసా పటిష్టం చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, వీణవంక మండల మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి, మాజి జడ్పీటీసీ మాడ వనమాల సాదవ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి కొండల్ రెడ్డి, హుజురాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు ఐలయ్య,మాజి జెడ్పిటిసి బక్క రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ రెండు లక్షల రూ.ల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామం ముదిగంటి సరోజన,మామిడాలపల్లి గ్రామంలో, ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబానికి బుధవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ద్వారా అందించే సాయం రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మున్సిపల్ రేణుక తిరుపతిరెడ్డి, జడ్పిటిసి మాడ వనమాల సాధవరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












