
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్, సెప్టెంబర్25: హుజురాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన నిరుపేద పద్మశాలి కులస్తుడు తోట లక్ష్మణ్ అనారోగ్యంతో మృతిచెందగా అంత్యక్రియలు చేయడానికి ఆ కుటుంబంలో డబ్బులు లేకపోవడంతో ఆర్థిక సాయం చేయాలని అతని భార్య వేడుకోవడంతో కాంగ్రెస్ నాయకులు ద్వార సమాచారం తెలుసుకున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందజేసి ఆ కుటుంబానికి నేనున్నానంటూ భరోసనిచ్చారు. వివరాల్లోకి వెళితే… మండలంలోని ధర్మరాజుపల్లి గ్రామంలో కోట లక్ష్మణ్, ప్రేమలత అనే భార్యాభర్తలు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. భర్త కోట లక్ష్మణ్ అనారోగ్యంతో మృతి చెందడంతో అంత్యక్రియలకు సరిపడా డబ్బులు లేకపోవడంతో దాతలు అంత్యక్రియల ఏర్పాటు చేశారు. ఇట్టి విషయం తెలుసుకున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ ధర్మరాజుపల్లి కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి తన వంతుగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయమని వారికి చెప్పడంతో వారి కుటుంబనికి కాంగ్రెస్ నాయకులు, ఆర్థిక సాయం అందజేశారు ఆర్థిక సాయం అందజేసిన వారిలో ధర్మరాజు పల్లి కాంగ్రెస్ నాయకులు కందాల తిరుపతి గౌడ్, అనిల్, రమణారెడ్డి, చుక్కరెడ్డి, రవి, శ్రీను, రమేష్, మొగిలి, తిరుపతి, వీరగోని తిరుపతి, శ్రీనివాస్, తిరుపతి, శ్యామ్, రవి, మొగిలి, మధుకర్ ఆర్థిక సాయం అందజేశారు.
