
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: చట్ట పరిధిలో మెదులుతేనే ప్రశాంతమైన జీవితం గడపవచ్చునని మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు వ్యక్తిత్వ వికాస నిపుణులు, ప్రజాకవి రచయిత సామాజికవేత్త తత్వవేత్త బ్రహ్మశ్రీ నాగుల సత్యం గౌడ్ పేర్కొన్నారు. దీనికన్నా ముందు ఇటీవల సిఐగా నూతన పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సత్యం గౌడ్.. హుజురాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి, బొకేను అందజేసి, పట్టు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్యం గౌడ్ మాట్లాడుతూ … శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు వ్యవస్థ పెండ్లి పోలీస్ ఏర్పర్చి, ప్రజలకు చేరువై , వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, శాంతిభద్రతల విషయంలో పోలీస్ పాత్ర అత్యంత కీలకమైంది అన్నారు. పోలీసు వృత్తినే దైవంగా నమ్మి, తమ వృత్తి ధర్మాన్ని సంపూర్ణంగా నిర్వర్తిస్తూ, వారి కర్తవ్య నిర్వహణలో తమ వంతు పాత్రను సంపూర్ణముగా పోషిస్తూ, సమాజంలో శాంతి భద్రతలు కాపాడుతున్నారన్నారు. ప్రతి భారత పౌరుడు అంటరాని స్వార్ధాన్ని వీడి, మనస్సాక్షికి కట్టుబడి, మనం ఏర్పరచుకున్న విలువలు కాపాడుకుంటూ, విలువైన వీరులుగా ఎదగాలన్నారు. స్వార్థం వీడిన ప్రతి మనిషి మహాత్ముడు మహనీయుడనని సత్యం గౌడ్ పిలుపునిచ్చారు. యువత విద్యార్థులు ప్రేమ పేరిట తమ జీవితాలను నాశనం చేసుకోకూడదని, చదువుతోటే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, సమాజానికి విద్యార్థులే మూల స్తంభాలని సత్యంగౌడ్ పేర్కొన్నారు. యువత విద్యార్థలు ప్రయోగకులై దేశభక్తిని పెంపొందించుకుంటూ దేశ రక్షణలో సిపాయిలు కావాలన్నారు. ప్రతి ఒక్కరు సేవ భావాన్ని పెంపొందించుకొని సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరు ధన కాంక్షను వీడి నిజాయితీగా మెధులుతూ, నిత్యజీవితంలో నిత్యం నిస్వార్ధంగా జీవించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం, మాల మహానాడు కరీంనగర్ ఇన్చార్జి తొగర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
