
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోనీ సైదాపూర్ రోడ్ లోని(బోర్నపల్లి) ఎస్సారెస్పీ కెనాల్ వద్ద గల శ్రీ లక్ష్మి గణపతి దేవాలయము అభివృద్ధికి దేవాదాయ శాఖ నుండి రూ 41 లక్షలు మంజూరు చేయించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్ధిల్లా శ్రీధర్ బాబును పలువురు ఘనంగా సత్కరించారు. లక్ష్మీ గణపతి దేవాలయం నిర్మాణంకు దాతల సహకారముతో కొంత వరకు నిర్మాణము చేయగా పూర్తిస్థాయిలో నిధులు లేక మధ్యలో ఉన్న నిలిచిపోయింది. మిగతా పనులు పూర్తి చేసేందుకు దేవాదాయ శాఖ నుండి నిధుల మంజూరు కి కృషి చేయాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుని కోరగానే రూ.41లక్షలు వెంటనే మంజూరి చేయించి ప్రొసీడింగ్ కూడా ఇప్పించారని వారు తెలిపారు. నిన్న జమ్మికుంటలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరేడ్డి దశ దిన కర్మకు వెళ్లి తిరిగి వెళుతూ బోర్నపల్లిలోని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దొంత రమేష్ ఇంట్లో కాసేపు ఆగిన సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబుని పలువురు కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పబిచ్చాలి ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. మంత్రి వెంట నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్, సత్కరించిన వారిలో బోర్నపల్లికి చెందిన వేద పండితుడు పందిళ్ల. భాస్కరశర్మ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దొంత రమేష్, దేశిని కోటి, చందమల్ల బాబు, క్యాస చక్రధర్, Dr విష్ణుదాస్ గోపాల్ రావు, బిఆర్ గౌడ్, దుబాసి బాబు, చందమల్ల నరేష్, వీరితో పాటుగా గ్రామస్తులు తదితరులు ఉన్నారు.


