
Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ అంటేనే క్రీడలు, క్రీడాకారులు అని, ప్రత్యేక గుర్తింపుతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎందరో క్రీడాకారులు రాణిస్తున్నారని హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ గందే రాధిక పేర్కొన్నారు. హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో రెండు రోజులుగా జరుగుతున్న జిల్లాస్థాయి పాఠశాలల కబడ్డీ పోటీలు మంగళవారం ముగిసాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బల్దియా చైర్ పర్సన్ గందె రాధిక, మండల విద్యాధికారి కే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలకు క్రీడాకారులకు హుజురాబాద్ నిలయమని, ఎలాంటి క్రీడలు అయినా శాంతియుత వాతావరణంలో హుజురాబాద్లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గెలుపు ఓటములను సమానంగా తీసుకొని మళ్ళీ రాణించేందుకు ఓటమి చెందిన క్రీడాకారులు కృషి చేసినప్పుడే క్రీడా స్ఫూర్తిని చాటినట్లు అని అన్నారు. రెండు రోజులపాటు ఇలాంటి అవాంతరాలు లేకుండా జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించేందుకు సహకరించిన క్రీడాకారులకు పట్టణ ప్రజలకు పిఈటిలకు పిడి లకు ఈ సందర్భంగా వారు అభినందనలు తెలిపారు. అండర్ 17 బాలుర కబడ్డీలో హుజురాబాద్ ప్రథమ స్థానంలో చొప్పదండి ద్వితీయ స్థానంలో నిలిచాయి. అలాగే బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో కరీంనగర్ అర్బన్ ద్వితీయ స్థానంలో సైదాపూర్ జట్లు నిలిచినట్లు నిర్వాహకుడు, పిడి సొల్లు సారయ్య తెలిపారు. అండర్ 14 సంవత్సరాల బాలికల విభాగంలో మొదటి స్థానంలో కరీంనగర్ అర్బన్ రెండవ స్థానంలో హుజురాబాద్ జట్లు నిలిచాయి. బాలుర విభాగంలో మొదటి స్థానంలో చొప్పదండి విలువగా ద్వితీయ స్థానంలో హుజురాబాద్ జట్లు నిలిచాయని ఆయన తెలిపారు. కాగా సాయంత్రం విజేతలైన క్రీడాకారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెడల్స్ జ్ఞాపికలను అందజేశారు విజయవంతంగా క్రీడలు నిర్వహించిన పిఈటిలు, బీడీలకు, నిర్వాహకులకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ అనురాధ, శోభారాణి, తిరుమల, శ్రీనివాస్, విడపు శ్రీనివాస్, SGF సెక్రటరీ వేణు, పిడి నరసయ్య, ఏ శ్రీనివాస్, చిరుత శ్రీనివాస్, కాల్వ రేణుక, డి సత్యానందం, సొల్లు అనిల్ కుమార్, టీ భాగ్యలక్ష్మి మరియు ఆర్గనైజింగ్ కార్యదర్శులు మరియు pd, pets పాల్గొన్నారని జిల్లా కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సొల్లు సారయ్య తెలిపారు.



