
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రముఖ రచయిత్రి, బొజ్జ విజయభారతి మృతి చెందడం పట్ల శనివారం రాత్రి హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజాసంఘాల నాయకులు కొవ్వొత్తులతో ఆమెకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాకవి బోయి భీమన్న కుమార్తె, బొజ్జా తారకం సతీమణి విజయభారతి సమాజ సేవ కోసం కృషి చేశారని, బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే ల జీవిత చరిత్రలను రచించిందని అన్నారు. ఆమె మృతి సాహిత్య రంగానికి , సమాజానికి ఎంతో తీరని లోటు అని అన్నారు. డా. బి ఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్రను రచించిన గొప్ప రచయిత్రి అన్నారు. ప్రముఖ అంబేడ్కర్ వాది బొజ్జా తారకం సతీమణి, తెలుగు అకాడమీని పునఃప్రతిష్ఠ చేసిన విధుషీమని, మహాత్మా ఫులే జీవిత చరిత్రను తెలుగు వారికి అందించిన సంస్కర్త, పురాణాల గుట్టువిప్పి షడ్ చక్రవర్తులు ఆర్యరాజ్య విస్తరణకు పాల్పడ్డారని తెలుగు ప్రజలకు వివరించిన పరిశోధకురాలు అన్నారు. కారంచేడు ఉద్యమం యూజిలో నాకు రక్షణ కల్పించిన వీర వనిత… ఆత్మీయురాలు… గొప్ప వ్యక్తిని కోల్పొయింది… ఆమె నిష్క్రమణ దేశానికి పెద్ద లోటు… ప్రజాసంఘాల ఘన నివాళి అర్పిస్తోంది అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, కౌన్సిలర్ ముక్క రమేష్, ప్రజా సంఘాల నాయకులు పాక సతీష్, మోరె సతీష్, రామ్ సారయ్య, తునికి సమ్మయ్య, మాడుగుల ఓదేలు, చీకట్లో సమ్మయ్య తాళ్లపల్లి అమరేందర్, మొలుగూరి కొమురయ్య, ఆడెపు శ్రీనివాస్, పుల్లూరి కృష్ణమూర్తి, పసుల స్వామి తదితరులు పాల్గొన్నారు
డాక్టర్ బి విజయభారతి మరణం పట్ల సంతాపం.
స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర రచించిన రచయిత్రి ,మహాకవి బోయి భీమన్న కుమార్తె, ప్రముఖ అంబేద్కర్ వాది ,అనగారిన వర్గాల హక్కులనేత, పేద ప్రజల కోసం పరితపించిన న్యాయవాది బొజ్జతారకం సతీమణి డాక్టర్ బోయి( బొజ్జ )విజయభారతి మరణం పట్ల తెలంగాణ సామాజిక రచయితల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పసుల స్వామి సంతాపం ప్రకటించారు. తెలుగు అకాడమీ ని పున ప్రతిష్టించిన, మహాత్మ జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను అందించిన గొప్ప సంస్కర్త, పరిశోధకురాలు డాక్టర్ విజయభారతి అన్నారు. 84 ఏళ్ల వయసులో కూడా ప్రతిరోజు సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటూ అనారోగ్యంతో ఉండి కూడా చివరి శ్వాస వరకు పేద ప్రజల హక్కుల కోసం, నిరంతరం వెళ్లిబుచ్చినారన్నారు. సాహిత్య కార్యక్రమాలలో పాల్గొంటూ ఈరోజు ఆమె మరణించడం పేద ప్రజలకు, సాహిత్య అభిమానులకు తీరని లోటని సంతాపం వెలిబుచ్చారు.


