
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి, దివంగత పౌర హక్కుల నేత బొజ్జా తారకం సతీమణి బి విజయభారతి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. ప్రముఖ రచయిత దివంగత బోయి భీమన్న కుమార్తె, ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జా మాతృమూర్తి అయిన విజయభారతి తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా సేవలు అందించడంతో పాటు ప్రాచీన సాహిత్య కోశం, ఆధునిక సాహిత్య కోశం వెలువరించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. సాహితీ రంగానికి విజయభారతి చేసిన సేవలు అపారమైనవని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

