Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో ఆదివారం నాడు తెలంగాణ పోస్టల్ సర్కిల్ వారి ఫీలాటెలి స్కాలర్షిప్ ఎగ్జామ్ ( స్పార్ష్ ) నిర్వహించబోతున్నామని హుజూరాబాద్ పోస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ సూపరిండెంట్ మోహన్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ హుజూరాబాద్ పట్టణంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థుల కోసం స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలను పరీక్ష కేంద్రంగా ఏర్పాటు చేశామని, విద్యార్థులు పరీక్షకు ఒక గంట ముందుగా పాఠశాలకు చేరుకోవాలని, హాల్ టికెట్, పెన్, పెన్సిల్, ఎరేజర్ వస్తువులు తప్ప మరే విధమైనవి తీసుకురావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతియాదవ్, ప్రిన్సిపాల్ కొండబత్తిని శ్రీనివాస్, పోస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






