
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(పెద్దపల్లి) ఆగస్టు 10: ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని పెద్దపల్లిలో డి జె ఎఫ్ ( డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్) 5వ రాష్ట్రీయ మహాసభ ఆదివారం రోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, స్థానిక పెద్దపల్లి శాసనసభ సభ్యుడు విజయరామారావు, ఎస్ఆర్ కె గ్రూప్ సంస్థ చైర్మన్ బండారి మారుతి, డీజేఎఫ్ ఫౌండర్ కృష్ణారెడ్డి, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ డిజేఎఫ్ లో ఉన్న సభ్యులకు మా వంతు ఆయా సహకారాలు ఏమైనా ఉంటే అందిస్తామని అన్నారు. దేశానికి నాలుగవ పిల్లర్ వారు మన జర్నలిస్టులు మాత్రమే అని కొనియాడారు.
డెమోక్రటిక్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (డిజెఎఫ్) ఆధ్వర్యంలో 5వ రాష్ట్ర మహాసభలు పెద్దపల్లిలో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ మహాసభలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జర్నలిస్టులు, ప్రతినిధులు, సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సభలో ప్రెస్ స్వేచ్ఛ, జర్నలిస్టుల భద్రత, వేతనాలు, గుర్తింపు, సంక్షేమ పథకాలు, ఆధునిక మీడియా సవాళ్లు, డిజిటల్ జర్నలిజం వంటి పలు అంశాలపై చర్చలు జరిగాయి. ప్రతినిధులు తమ అనుభవాలు, సమస్యలు పంచుకున్నారు. మహాసభలో కొత్త రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాబోయే సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. జర్నలిస్టుల ఐక్యత, హక్కుల కోసం కట్టుబడి పనిచేయాలని తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని సభ విజయానికి తోడ్పడ్డారు. మహాసభ విజయవంతం కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.


పోస్టర్స్ ను ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయ రమణారావు, ముఖ్య అతిథులు…






