Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
రైతు బీమా పథకము 2025 సంవత్సరానికి గాను జూన్- 5,2025 వరకు కొత్తగా పట్టాదారు పాస్ బుక్కులు వచ్చిన అర్హత కలిగిన రైతుల యొక్క వివరాలు వ్యవసాయ శాఖ అధికారుల లాగిన్ లలో వచ్చి ఉన్నవి. కావున రైతు సోదరులు11/08/2025 నుండి 13/08/2025 లోపు తమ వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద సదరు ధ్రువ పత్రాలను అందించి దరఖాస్తు చేసుకోగలరనీ హుజురాబాద్(R) సహాయ వ్యవసాయ సంచాలకులు జీ సునీత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు కొరకు కావలసినవి
రైతు బీమా దరఖాస్తు ఫారం, భూమి పట్టాదారు పాస్ బుక్కు (లేదా) రిజిస్ట్రేషన్ అయిన ప్రొసీడింగ్స్ కాపీ, పట్టాదారు ఆధార్ కార్డు జిరాక్స్, నామిని ఆధార్ కార్డు జిరాక్స్ అందించాలన్నారు.
రైతు సోదరులు సమయం తక్కువగా ఉన్నందున గడువు ముగియక ముందే రైతు బీమాకి దరఖాస్తు చేసుకోగలరన్నారు.
అదే విధంగా అంతకు ముందు బీమా కలిగి ఉండి మార్పులు ఏమైనా ఉన్న లేక అంతకు ముందు దరఖాస్తు చేసుకోలేకపోయిన కూడా సంబంధించిన వివరాలతో సంప్రదించగలరనీ ఆమె సూచించారు.





