
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను స్థానిక సంస్థలతోపాటు విద్యా ఉద్యోగాలలో అమలు చేయాలని చెప్పి రాష్ట్ర క్యాబినెట్ ఆర్డినెన్స్ జారీ చేయడం ఇది ముమ్మాటికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శాసన మండలి సభ్యురాలు కవితక్క విజయంగా భావిస్తూ ఈరోజు కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో సంబరాలు చేయడం జరిగింది. కవితక్క గత సంవత్సర కాలంగా నిరంతరం బీసీల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అటువంటి ఏకైక లక్ష్యంగా ఈరోజు వారు ఉద్యమం చేస్తున్నారన్నారు. కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు దిగివచ్చి 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఆర్డినెన్స్ ఇవ్వడం ముమ్మడి కవితక్క విజయంగా భావిస్తూ కరీంనగర్ గుంజపడుగు హరిప్రసాద్ ఆద్వర్యంలో సంబరాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో UPF నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, తూల భాస్కర్ రావు, గొట్టం మహేష్, భరతం అఖిల్, మడిపల్లి వినిత్, పూసాల రణదీర్, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


కరీంనగర్ లో గుంజపడుగు హరిప్రసాద్ ఆద్వర్యంలో సంబరాలు జరుపుతున్న దృశ్యాలు.