Oplus_0
–మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
–ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో వెలుగులు నింపడమే మా లక్ష్యం
–చేప పిల్లల పంపిణీ భవిష్యత్ లో మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవాలి – మంత్రి పొన్నం ప్రభాకర్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు నిండుకుండలా మారాయని తెలంగాణ జిల్లాల్లోని అన్ని చెరువుల్లో చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 3వ తేదీ నుండి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో తెలంగాణ మత్యశాఖ తరుపున చేపల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. జిల్లాలో మంత్రులు, విప్ లు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు కార్పోరేషన్ చైర్మన్ లు, ప్రభుత్వ సలహాదారులు మత్స్య కార్మిక కుటుంబాలకు అండగా ఉండే విధంగా చేపల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వంలో వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో వెలుగులు నింపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల్లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. చెరువుల్లో వేసే దానిలో నాణ్యమైన చేప పిల్లల పంపిణీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. చేప పిల్లల పంపిణీ గ్రామాల్లో ఒక పండగ వాతావరణంలో జరగాలని సూచించారు. అన్ని చెరువులు , ప్రాజెక్ట్ లు జలకళ సంతరించుకోవడంతో చేప పిల్లల పంపిణీ భవిష్యత్ లో మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ తో పాటు, డైరెక్టర్ ప్రియాంక అలా చేప పిల్లల పంపిణీ కార్యక్రమంకి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.






