Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మండలంలోని చెల్పూర్ గ్రామంలో పేద కుటుంబానికి చెందిన ఎండి అక్తర్ పాషా కరీంనగర్ జిల్లా స్థాయి డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు. తన పూర్తి విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాల నుండి ప్రభుత్వ కళాశాలలోనే పూర్తి చేశాడు. మహాత్మ జ్యోతిబాపూలే గురుకులంలో విధులు నిర్వహిస్తూనే, డీఎస్సీ కరీంనగర్ జిల్లా స్థాయి ఫలితాల్లో 82.6 మార్కులతో మొదటి ర్యాంకు సాధించిన ఘనత అక్తర్ కే దక్కింది. ఈ విజయంలో తనకు సహాయ సహకారాలు అందించిన దీకొండ సురేష్ ఎంతగానో తోడ్పడ్డారని కొనియాడారు. తనకు చేయూతనందించిన మిత్రులకు శ్రేయోభిలాషులకు తన విజయం వారికి అంకితం అన్నారు. డీఎస్సీ ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని ఆయన తెలిపారు.








