
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో ఇటీవల అకస్మాత్తుగా రక్త కణాలు తగ్గి డెంగ్యూ లక్షణాలతో మరణించిన 30 వ వార్డుకు చెందిన చిన్నారి రావుల రిషిత మరణించగా, వారి కుటుంబ సభ్యులను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సందర్శించి పరామర్శించారు. ముందుగా చిన్నారి రిషిత చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను మృతి చెందిన తీరుని అడిగి తెలుసుకుని ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, అవార్డు ప్రజలు, కుటుంబ సభ్యులు ఉన్నారు.







