

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏ సి టి ఓలకు గజిటెడ్ హోదా కల్పించడానికి టి సి టి ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మంత్రి డి శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి చేశారు. గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈ ఉద్యోగుల హోదాను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రస్తుతం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీరికి సంబంధించిన రెండు పిఆర్సిలు ఫైనాన్స్ క్లియరెన్స్ పొందటంతో పాటు జేఏడీ సర్వీసెస్ క్లియరెన్స్ కూడా అందించబడింది. అయితే, గజిటెడ్ హోదా ఇప్పటివరకు అందుబాటులోకి రాకపోవడం చాలా బాధాకరమైన విషయమని వారు పేర్కొన్నారు. ఈ విషయం పై మంత్రి డి శ్రీధర్ బాబు స్పందిస్తూ, సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కూడా ఈ విషయంలో సంబంధిత చర్యలు తీసుకోవాలని సూచించడంతో, గజిటెడ్ హోదా త్వరగా అందుబాటులోకి రాగలదని ఆశిస్తున్నారు.





