
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి: సికిందరాబాద్ మౌలాలిలోని శ్రీనివాస హైట్స్ వద్ద ప్రో.జిఎన్ సాయిబాబా పార్ధీవదేహం వద్ద తెలంగాణ రాష్ట్ర డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు ఎం.రఘుశంకర్ రెడ్డి, తాటిపల్లి లింగారెడ్డి, అటుకుల శ్రీనివాస్ రెడ్డి, సోమయ్య, రమాదేవి, హుజురాబాద్ జనసాహితి కన్వీనర్ ఆవునూరి సమ్మయ్య, లియో ఆగస్టీన్ తదితరులు జోహార్లు అర్పించారు. సాయిబాబా బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేశారు.






