Oplus_0
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ (జమ్మికుంట) : పది సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య వేదికలను, సమాజాన్ని చైతన్య పరచడం కోసం కృషి చేసిన ప్రొఫెసర్ సాయిబాబాని ఈ రాజ్యము అర్బన్ నక్సలైట్ గా ద్రోహం మోపి జైల్లో నిర్బంధించడం, కనీసం వికలాంగుడు అనికూడా చూడకుండా దుర్భరమైనటువంటి జైల్లో నిర్బంధించడం వలన అనారోగ్యం పాలయ్యారని ప్రజాస్వామిక వాదులు ఆరోపించారు. 10 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఈ రాజ్యము అతన్ని నిర్దోషి అని నిర్ధారించి చట్టం ద్వారా విద్య చేయడం జరిగిందన్నారు. ఇది నిజంగా ప్రభుత్వం చేసిన హత్యని వారు విమర్శించారు. సాయిబాబా గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యముతో జీవితాన్ని ముగించిన సాయిబాబా మరణము ప్రజాస్వామ్యవాదులకు తీరనిలోటు అని వక్తలు పేర్కొన్నారు. సాయిబాబా అనేక ప్రజాస్వామిక సంఘాలకు మద్దతు తెలుపుతూ ప్రజాస్వామ్య తెలంగాణ కోసం మొట్టమొదటిసారిగా వరంగల్ డిక్టరేషన్ లో మద్దతు తెలుపడం జరిగిందని, పీడిత, తాడిత, ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం కృషి చేసాడని అటువంటి తెలంగాణ వాదిని కోల్పోవడం తెలంగాణ వాసులందరికీ చాలా బాధాకరమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎస్ తిరుపతయ్య, కార్మిక నాయకుడు తెలంగాణ హమాలి కార్మిక సంఘం అధ్యక్షులు గుంటి సామ్రాజ్యం, డిటిఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి, ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామంచ భరత్, మర్రి అవినాష్, టి పిటిఎఫ్ నాయకులు, డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఏబూసి శ్రీనివాస్, జమ్మికుంట ప్రజాస్వామిక సంస్థల నాయకులు తదితరులు పాల్గొని ప్రొఫెసర్ సాయిబాబాకి ఘన నివాళులు అర్పించారు.






