Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ జర్నలిస్టులకు గత ప్రభుత్వం అందించిన నివేషణ స్థలాల సమస్యను పరిష్కరించాలని టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు హుజురాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాదులోని గాంధీభవన్ లో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని సత్కరించారు. అనంతరం హుజురాబాద్ జర్నలిస్టులకు ఇచ్చిన నివేషణ స్థలాలకు సంబంధించి ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కో- కన్వీనర్లు కాయిత రాములు, నిమ్మటూరు సాయికృష్ణలు మాట్లాడుతూ…గత 20 ఏళ్లుగా హుజురాబాద్ లో పాత్రికేయులుగా కొనసాగుతున్న తమకు గత ప్రభుత్వం కేసీ క్యాంపులో నివేశన స్థలాలను అందజేసిందని, దీనికి సంబంధించి నెలకొన్న కోర్టు సమస్యను ఈఎన్ సి సర్టిఫికెట్ అందించేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించాలని టిపిసిసి అధ్యక్షున్ని కోరినట్టు తెలిపారు. జర్నలిస్టుల నివేశన స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. మహేష్ కుమార్ గౌను కలిసిన వారిలో ప్రెస్ క్లబ్ అడక్ కమిటీ సభ్యులు పోతరాజు సంపత్, సభ్యులు తాటిపాముల దేవేందర్ లు ఉన్నారు.






