Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మాలల మహా పాదయాత్ర కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు రాష్ట్ర నాయకులు మేడి అంజయ్య, వెన్న రాజులు మాట్లాడుతూ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం 6-1 మెజారిటీతో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ రాష్ట్రాల పరిధిలో చేసుకోవచ్చని ఇచ్చిన గైడ్ లైన్స్ అంబేద్కర్ ఆశయాలపై ఒక గొడ్డలిపెట్టుగా మారిందని అన్నారు. దళితులను రాజ్యాధికారానికి దూరం చేయాలన్న కుట్రతో ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపి రాజకీయ పార్టీలను , ప్రభుత్వాలను ఒక వర్గం వారు పనిగట్టుకుని దళిత సమాజాన్ని తప్పుతో పట్టిస్తూ పబ్బం గడుపుకుంటు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని అన్నారు.
వర్గీకరణ వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ “మాలల మహాపాదయాత్ర “కొనసాగుతుందన్నారు. ఈ పాదయాత్ర 25 అక్టోబర్ 2024 రోజున భద్రాచలంలో ప్రారంభమై హైదరాబాదులో నవంబర్ 1న బారీ భహిరంగ సభతో ముగుస్తుందని తెలిపారు. ఈ పాదయాత్ర ఒక 1000 కిలోమీటర్లు,16 జిల్లాలు,36నియోజక వర్గాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిరావు పూలే మొదలగు నాయకుల స్ఫూర్తితో కొనసాగుతుందన్నారు. ఈ పాదయాత్ర హుజురాబాద్ కు తేదీ 09.11.2024వ రోజున చేరుకుంటుందని, ఈ పాదయాత్రలో మాల, మాల ఉపకులాల ప్రజలు, విద్యార్థులు, మహిళలు ప్రజాస్వామ్య వాదులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సీనియర్ నాయకులు సొల్లు బాబు, తోగరు స్వామి, పసుల స్వామి, కోడం నర్సింగం, కర్రె తిరుపతి, జూపాక నరసింహం, బందెల హరీష్, సొల్లు దశరథం, జూపాక శ్రీనివాస్, పిట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






