
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జరిగిన కబడ్డీ బాలుర మరియు బాలికల కబడ్డీ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి సౌత్ జోన్ లో జరిగే కబడ్డీ పోటీలకు హుజురాబాద్ మండలం సింగాపురంకు చెందిన విఎస్ఆర్ డిగ్రి కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల నిర్వాహకులు తెలిపారు. కళాశాలలో చదివే జి రాహుల్ ప్రస్తుత శాతవాహన యూనివర్సిటీ కబడ్డీ టీమ్ కి కెప్టెన్ వ్యవహరిస్తున్నాడని, జె వేణు, మరియు బాలికల నుండి బి అర్చన, డి నాగలక్ష్మీ వీరు ఈ నెల 28న చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగే కబడ్డీలో పోటీల్లో పాల్గొననున్నారు. అలాగే బాలికలు వచ్చే నెల 26న చెన్నై అలాగప్ప యూనివర్సిటీలో జరిగే కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నారు. వీరి సెలెక్షన్ పట్ల విఎస్ఆర్ డిగ్రి కళాశాల మేనేజ్ మెంట్ వొడితల సతీష్ కుమార్, వొడితల ఇంద్రనీల్, కళాశాల ప్రిన్సిపాల్ డా” వివిఎన్ హనుమకుమార్, ఫిజికల్ డైరెక్టర్ సిద్ధమల్ల విజయ్ మరియు అధ్యాపకులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.







