మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పౌరుల సంరక్షణ ప్రధమ కర్తవ్యంగా పోలీసులు తమ సేవలను అందిస్తూ అనేక త్యాగాలను చేస్తున్నారని వారి సేవలు మరువలేనివని హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి అన్నారు. గురువారం హుజురాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు చేస్తున్న పలు సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి పౌరుడు పోలీసుగా భావించాలని ప్రజల సంరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న వారికి సహకారం అందించాలన్నారు. పోలీసులు సమాజంలో ఒక వ్యక్తిగా ఉంటూ సమాజ రక్షణ కోసం తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడని తెలిపారు. ప్రతి వ్యక్తి పోలీసు విధులకు ఆటంకం కలిగించకుండా సహకరించాలని సూచించారు. మహిళల సంరక్షణ కోసం షీ టీమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ర్యాగింగ్ గాని ఇతర మహిళల సమస్యల గురించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు వెంటనే షి టీములను సంప్రదించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గాలంటే ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు రహదారి భద్రత నియమాలు తప్పనిసరి తెలిసి ఉండాలని అన్నారు. దానివల్ల రహదారులపై ఎలా వెళ్లాలి ఎలా వ్యవహరించాలి అనేది తెలుస్తాయని అన్నారు. పోలీసులు ప్రజల రక్షణ కోసం ఉపయోగించే తుపాకుల గురించి తెలుసుకోవాలని వాటి నిర్వాహణ ఇతర విషయాలను పిల్లలకు వివరించారు. కేసులు ఎలా పెడతారు ఎఫ్ఐఆర్ అనగానేమిటి ఇతర పోలీసు పరిభాషను విద్యార్థులకు ఆయన వివరించారు. ఎవరిపై కేసులు పెడతారు, ఎవరిని సంప్రదించాలి అనే విషయాలను ఉదాహరణలతో పిల్లలకు వివరించారు. పోలీసు చట్టాల పట్ల విద్యార్థులకు అవగాహన ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ లోని పలు తుపాకులను స్పీడు గన్, మెటల్ డిక్టేటర్, తదితరాంశాలపై ప్రదర్శన ఇచ్చారు. పట్టణంలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు విద్యార్థినీలు పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీసుల నుండి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ జి తిరుమల్ గౌడ్, జమ్మికుంట సిఐ వరగంటి రవి, షీ టీం సీఐ విజయలక్ష్మి, సరేలాల్, ఏఎస్ఐ రాజేశ్వరరావు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
- Home
- పోలీసుల త్యాగాలు మరువలేనిది.. హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి