Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : బీసీల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ ఉద్యమిస్తుందని నూతనంగా నియమితులైన హుజూరాబాద్ అసెంబ్లీ అధ్యక్షులు పంజాల తిరుపతిగౌడ్ అన్నారు. బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ అసెంబ్లీ అధ్యక్షులుగా చెల్పూర్ గ్రామానికి చెందిన పంజాల తిరుపతిగౌడ్ ను నియమిస్తూ ఆ సంఘం అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ నియామక పత్రం అందజేసినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాగ్రామాన బీసీలను సంఘటితం చేయాలని, తమ హక్కులను సాధించుకునే దిశగా బీసీలను చైతన్యపర్చాలని జక్కని సూచించారు. ఈ సందర్భంగా పంజాల తిరుపతిగౌడ్ మాట్లాడుతూ… బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్మ చేయకుండా పట్టుదలతో పని చేస్తానని. గ్రామాగ్రామాన కమిటీలను నియమిస్తూ బీసీలను చైతన్యపరుస్తూ ముందుకు సాగుతానన్నారు. తనకు ఈ పదవిని అప్పగించిన జక్కని సంజయ్ కుమార్ కు, ఫెడరేషన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.






