Oplus_131072
–బీఆర్ఎస్ నాయకుల బాగోతాలు అందరికీ తెలుసు, త్వరలో మీ చిట్టాలు బయటికి తీస్తాం.
–ఎన్నికల్లో ఇచ్చిన 1000కోట్ల హామీ ఏమైంది.
–అవినీతి,అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్ పార్టీ.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి వొడితల ప్రణవ్ ను విమర్శించే నైతికత, స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఆదివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతూ రాజకీయపబ్బం గడుపుకుంటున్నాడని, శనివారం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటల్లో నిజం లేదని ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే వారు చేసిన అరాచకాలు,భాగోతాలు బయటకు తీస్తామని, హుజురాబాద్ మాజీ మార్కెట్ చైర్మన్ కొండాల్ రెడ్డి మార్కెట్ పదవిని అడ్డుపెట్టుకొని ఏ మేం చేశాడో ప్రజలందరికీ తెలుసునని త్వరలోనే అవన్నీ బయటికి వస్తాయని హెచ్చరించారు. హుజురాబాద్ నుండి ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డిని గెలిపిస్తే హుజురాబాద్ అభివృద్ధిని గాలికి వదిలేసి హైదరాబాద్ లోని కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావులకు సంచులు మోస్తూ పనిచేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ప్రణవ్ బాబుపై అవాకులు చవాకులు పేలితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొల్లూరి కిరణ్, సొల్లు బాబు, నేరేళ్ళ మహేందర్ గౌడ్, కొలిపాక శంకర్, సందమల్ల బాబు, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, తునికి రవి, గంటా కిరణ్ రెడ్డి, కెఆర్ భిక్షపతి, యండి చాంద్ పాషా, పుల్ల రాధ, బుర్ర రేణుక, యండి రియాజ్, సొల్లు సునిత, షిలగాని లక్ష్మి, సునిత, తునికి లింగయ్య, రిబ్కా, సిగ లత తదితరులు పాల్గొన్నారు.







